నవరాత్రి పూజ ఎలాంటి పుష్పాలతో చేయాలి?

గురువారం, 15 అక్టోబరు 2015 (18:46 IST)
నవరాత్రుల్లో అమ్మవారితో ఎలాంటి పువ్వులతో పూజించాలో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. సంపెంగ, మందారం, కదంబం మొదలైన పువ్వులతో అమ్మలగన్న అమ్మను పూజించాలి. మల్లెలు కూడా ఉపయోగించవచ్చు. అలాగే మంచి గంధం, అగరు, కర్పూరం వంటి షోడశోపచారములతో పూజ చేయాలి. 
 
అలాగే కొబ్బరి, అరటి, నారింజ, దానిమ్మ, పనస, మొదలైన ఫలాలతో, భక్ష్య, భోజ్య, లేహ్య, పానీయాలతో, అన్నపాయసాలతో, ధూప దీపాలతో, స్తోత్రాలతో, అష్టోత్తరశతనామావళిలతో, లలితా సహస్ర నామావళితో, నమస్కృతులతో తొమ్మిది రోజుల పాటు అమ్మను పూజించాలి. 
 
ఇలా తొమ్మిది రోజుల పాటు అమ్మను పూజించేవారి సకలసంపదలు చేకూరడంతో పాటు ఈతిబాధలు తొలగిపోతాయి. సంసారిక జీవితమును సుఖ సంతోషములతో గడుపుతారు. ఎలాంటి బాధలకూ లోనుకారు. పూజ యధావిధిగా చేసి యధాశక్తిగా అన్నదానం చెయ్యాలి. పూజ చేసే వ్యక్తి ఈ తొమ్మిది రోజులు నేలపై నిద్రించాలి, బ్రహ్మచర్యం పాటించాలి. 

వెబ్దునియా పై చదవండి