విష్‌ యు హ్యాపీ న్యూ-ఇయర్... 2009

WD
నూతన సంవత్సరం వస్తుంది.. అందరి జీవితాల్లో వెలుగును నింపుతుందని ఆకాంక్షిస్తూ... ఒకరికొకరు "విష్ యు హ్యాపీ న్యూ-ఇయర్" శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. ప్రపంచ దేశాల్లోని ప్రజలంతా సమైక్యాభావంతో జరుపుకునే ఈ న్యూ-ఇయర్ పండుగను భారతదేశంలో అత్యంత వైభవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

సిడ్నీలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ అర్థరాత్రి ఘనంగా నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటారు. సిడ్నీలోని వాణిజ్య నగరమైన వాల్ఫరైసొలో గత సంవత్సరం 80వేల బాణసంచాలను కాల్చి న్యూ-ఇయర్‌కు ఆహ్వానం పలికారు. సిడ్నీలో జరిగిన ఈ న్యూ-ఇయర్ వేడుకల్లో దాదాపు ఐదులక్షల మంది ప్రజలు పాల్గొన్నారు.

ఈ ఏడాది కూడా దాదాపు 21 కిలోమీటర్ల దూరంలో రంగు రంగుల బాణసంచాలను కాల్చి చూపరులను పెద్ద ఎత్తున ఆకట్టుకునే రీతిలో అంగరంగ వైభవంగా కొత్త సంవత్సరపు వేడుకలు జరుగనున్నాయి. భారీస్థాయిలో జరిగే ఈ నూతన సంవత్సర వేడుకను ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఇదేవిధంగా న్యూయార్క్‌లోనూ ఈ రోజున (డిసెంబర్ 31) కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరుగనున్నాయి.

2008 సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని ఉత్పాతాలు చోటుచేసుకున్నా... నూతన సంవత్సరం తమ జీవితాల్లో సుఖసంతోషాలను అందించాలని ప్రజలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు.

ముంబై పేలుళ్లు, చైనా భూకంపం, ఆర్థిక సంక్షోభం వంటి ఘటనలను చవిచూసినా... కొత్త సంవత్సరం శాంతి మార్గాలను అందిస్తుందని ప్రపంచ దేశాలు ఆకాంక్షిస్తూ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నాయి. మరి... మనం కూడా ప్రపంచదేశాల్లోని ప్రజలు నూతన సంవత్సరంలో సుభిక్షంగా జీవించాలని ఆశిద్దాం...!

వెబ్దునియా పై చదవండి