గ్లాస్గోకే "చికెన్ టిక్కా మసాలా" పేటెంట్...!

ఆసియాలో పేరుమోసిన వంటకం "చికెన్ టిక్కా మసాలా" బ్రిటన్ ఆహార ప్రియుల జిహ్వ చాపల్యాన్ని తీర్చుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే వంటకం తాజాగా బ్రిటన్ పార్లమెంటులో సైతం చర్చకు కారణంగా నిలిచింది. పాకిస్థాన్ సంతతికి చెందిన ఓ ఎంపీ గ్లాస్గో పట్టణాన్ని "చికెన్ టిక్కా మసాలా" పుట్టినిల్లుగా ప్రకటించాలని మొండిపట్టు పట్టిన కారణంగానే పై చర్చ జరిగింది.

లేబర్ పార్టీకి చెందిన సదరు ఎంపీ మహమ్మద్ సర్వర్... చికెన్ టిక్కా మసాలాకు పుట్టినిల్గుగా గ్లాస్గో పట్టణాన్ని గుర్తిస్తూ ఒక తీర్మానం చేయాలని భీష్మించుకు కూర్చున్నారు. ఇదే పట్టణానికే చెందిన అలీ అహమ్మద్ అస్లామ్ మొట్టమొదటగా ఈ వంటకాన్ని తయారు చేశాడనీ, అందుకే ఈ కర్రీ పేటెంట్ హక్కులు ఈ పట్టణానికే చెందాలని ఆయన గట్టిగా వాదించారు.

ఇదిలా ఉంటే... గ్లాస్గో పట్టణం ఇప్పటికే మూడుసార్లు "కర్రీ కేపిటల్ ఆఫ్ బ్రిటన్"గా నిలిచిన సంగతి విదితమే...!

వెబ్దునియా పై చదవండి