పాలక్‌ చికెన్‌ను ఎలా తయారు చేస్తారు?

గురువారం, 15 మే 2014 (17:32 IST)
File
FILE
కావలసిన పదార్థాలు:
చికెన్: అర కేజీ.
ఉల్లిపాయలు : 5
పచ్చిమిర్చి: 5
ఎండుమిర్చి: 5
పాలకూర : ఒక కట్ట లేదా 200 గ్రాములు.
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : రెండు టీ స్పూన్‌లు.
గరం మసాలా: ఒక టీ స్పూన్.
దాల్చిన చెక్క : చిన్న ముక్క,
లవంగాలు : 5,
ఏలకులు : 3
పసుపు : సరిపడ.
పుదీనా : 6 రెమ్మలు
ఉప్పు : సరిపడ
కరివేపాకు: 3 రెమ్మలు.
జీడిపప్పు: 10-15
కొత్తిమీర తరుగు.

తయారీ విధానం..
ముందుగా అనువైన ముక్కలతో కట్ చేసుకున్న చికెన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని సన్నగా తరగాలి. చికెన్ ముక్కలకు పసుపు, మసాలా పట్టించి కొద్దిగా నీరు పోసి స్టౌ మీద పెట్టి కొద్ది సేపు ఉడికించాలి. ఇలా ఓ పది నిమిషాలు ఉడికించాలి.

ఆ తర్వాత స్టౌ మీద బాండలిలో నూనె పోసి, కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పుదీనా, పాలకూర వేసి వేగాక, ఉప్పు కలిపి, ఉడికిన చికెన్ ముక్కలను అందులో వేసి వేయించాలి. చికెన్ ముక్కలు బాగా ఉడికిన తర్వాత దించే ముందు దనియాల పొడి, జీడిపప్పు, కొత్తిమీర చల్లాలి. మరో రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచి వుంచినట్టయితే పాలక్ చికెన్ రెడీ అయినట్టే.

వెబ్దునియా పై చదవండి