ఫిష్ తండూరీ ఎలా చేయాలి?

FILE
చేపలను వారానికి రెండుసార్లు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే చేపలతో ఎప్పుడూ గ్రేవీలు, ఫ్రైల్లా కాకుండా తండూరీ ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దామా..

కావలసిన పదార్థాలు :
తండూరీ తగిన పెద్ద చేపలు - అర కేజీ
మిరప పొడి - రెండు టేబుల్ స్పూన్లు
పసుపు పొడి - ఒక టీ స్పూన్

పేస్ట్ కోసం..
పచ్చిమిర్చి- 50 గ్రాములు
వెల్లుల్లి - పావు కప్పు
మిరియాలు - రెండు టేబుల్ స్పూన్లు
పుదీనా, కొత్తిమీర - చెరో అర కప్పు
ఉప్పు - తగినంత
వెనిగర్ - నాలుగు టీ స్పూన్లు

తయారీ విధానం :
ముందుగా చేప ముక్కల్ని శుభ్రం చేసి మధ్యలో గాట్లు చేసుకోవాలి. పేస్ట్ చేసిన మిశ్రమానికి వెనిగర్ చేర్చి రెండు గంటలు నానబెట్టాలి. తర్వాత చేపముక్కల్ని గ్రిల్స్‌కు తగిలించి, ఓవన్లో 280 డిగ్రీల వద్ద ఉంచాలి. పది నిమిషాలకు ఒకసారి తిప్పుతూ వుండాలి. చేప ముక్కలు ఇరువైపులా బాగా దోరగా అయ్యేంత వరకు వుంచి వేడి వేడిగా నిమ్మరసం పుదీనా, ఉల్లి చట్నీతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.

వెబ్దునియా పై చదవండి