మదురై స్పెషల్ మటన్ బిర్యానీ ఎలా చేయాలి?

FILE
తమిళనాడులోని మదురైలో అన్నీ ప్రత్యేకమే. ఇడ్లీలు, మల్లెల్లు, సుప్రసిద్ధ ఆలయాలు ఇలా ఎన్నో వున్నాయి. అలాంటి మదురైకి చెందిన స్పెషల్ మటన్ బిర్యానీ ఎలా వుంటుందో రుచి చూశారా.. అయితే ఈ వీకెండ్ ఈ రిసిపీ ట్రై చేయండి.. మదురై స్పెషన్ మటన్ బిర్యానీ ఎలా చేయాలంటే..

కావలసిన పదార్థాలు :
మటన్ - ముప్పావు కేజీ
బిర్యానీ రైస్ - ఒక కేజీ
ఉల్లి తరుగు - రెండు కప్పులు
టమోటా తరుగు - రెండు కప్పులు
పచ్చిమిర్చి- 8
పుదీనా, కొత్తిమీర తరుగు- ఒక కప్పు
నిమ్మ - రెండు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - అర కప్పు
నూనె- తగినంత
దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, ఏలకులు - తాలింపుకు తగినంత
మిర్చి పౌడర్ - 3 టీ స్పూన్లు
ధనియాల పొడి - రెండు టీ స్పూన్లు
పసుపు పొడి - ఒక టీ స్పూన్
నెయ్యి - 50 గ్రాములు
ఉప్పు - తగినంత
కేసరి పౌడర్ - చిటికెడు

తయారీ విధానం :
ముందుగా మటన్‌ను శుభ్రం చేసుకుని పక్కన బెట్టుకోవాలి. కుక్కర్లో మటన్, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నీటి చేర్చి ఉడికించుకోవాలి. తర్వాత బాస్మతి రైస్‌ను పది నిమిషాల పాటు నానబెట్టి ఉడికించి పక్కన బెట్టుకోవాలి. పెద్ద బాణలిలో నూనె పోసి కాగాక ఏలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు చేర్చి వేపాలి.

ఈ మిశ్రమానికి ఉల్లి తరుగు, టమోటాలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఉప్పు చేర్చి దోరగా వేపుకోవాలి. తర్వాతమిర్చి పౌడర్, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, పెరుగు, ఉడికించిన మటన్ ముక్కలు చేర్చి అర గ్లాసు నీరు చేర్చి కాసేపు ఉడికించాలి.

ఈ మటన్ మసాలా మిశ్రమాన్ని ఉడికించిన అన్నంలో బాగా కలుపుకోవాలి. చివరగా నిమ్మరసం అన్నంపై పిండుకోవాలి. నెయ్యి కూడా కలిపి అన్నాన్ని కుక్కర్లోకి తీసుకుని బాగా మూతపెట్టి ఐదు నిమిషాల పాటు స్టౌ మీద సిమ్‌లో ఉంచి దించేయాలి. అంతే మదురై స్పెషల్ మటన్ బిర్యానీ రెడీ..

వెబ్దునియా పై చదవండి