చికెన్‌లో ప్రోటీన్లు పుష్కలంగా వున్నాయి. వర్షాకాలంలో చికెన్‌ను మితంగా తీసుకోవాలి. కండరాల పుష్టికి బరువు నియంత్రించేందుకు చికెన్‌ను మాసానికి రెండు లేదా మూడుసార్లు తీసుకోవాలి. అలాగే బాదం పప్పు కూడా మంచి కొలెస్ట్రాల్‌ను పెంపొందింపజేస్తుంది. ఇంకా చెడు కొలెస్ట్రాల్ శరీరంలో చేరకుండా చేస్తుంది. ఈ రెండింటి కాంబోలో బాదం చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం..
నెయ్యి: 2 టేబుల్‌స్పూన్లు,
పెరుగు: అర కప్పు,
పచ్చిమిర్చి తరుగు : పావు కప్పు
యాలకులు: నాలుగు, లవంగాలు: నాలుగు, దాల్చినచెక్క తాలింపుకు తగినంత
ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలకు నిమ్మరసం, ఉప్పు, మిరియాలపొడి, వెల్లుల్లి ముద్ద పట్టించి అరగంటసేపు నాననివ్వాలి. స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక ఉల్లిముక్కలు, పసుపు వేసి చల్లారాక వీటికి పచ్చిమిర్చి చేర్చి ముద్దలా చేయాలి. ఈ ముద్దను చికెన్ ముక్కలకు పట్టించాలి. పెరుగులో బాదంపొడి, ధనియాలపొడి కలిపి, ఈ మిశ్రమాన్ని కూడా చికెన్ ముక్కలకు పట్టించాలి.
మరో పాన్‌లో నెయ్యి వేసి వేయించాక యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, పలావు ఆకులు వేసి వేపాలి. ఆపై నానబెట్టిన చికెన్ ముక్కల మిశ్రమాన్ని వేసి మూతపెట్టి మధ్య మధ్యలో కదుపుతూ సిమ్‌లో ఉడికించాలి. చికెన్ ఉడికాక దించేసి బాదం పలుకులతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.