కాకరతో రొయ్యల కూర ఎలా తయారు చేస్తారు?

బుధవారం, 2 జులై 2014 (18:04 IST)
కావలసిన పదార్థాలు: 
రొయ్యలు: అరకిలో 
కాకరకాయలు: 3/4 కిలో 
ఉల్లిపాయలు: రెండు 
మజ్జిగ: ఒక గ్లాసు 
కొత్తిమీర: ఒక కట్ట 
పసుపు: కొంచెం 
ఉప్ప: తగినంత 
కారం: నాలుగు స్పూన్‌లు 
నూనె: 100 గ్రాములు 
పచ్చిమిర్చి: ఎనిమిది
 
తయారు చేయు విధానం: 
కాకరకాయలను ముక్కలుగా కోసి మజ్జిగతో ఉడికించి నీటిని క్రిందికి పోసి పక్కన పెట్టుకోండి. బాణలిలో నూనె పోసి బాగా కాగాక రొయ్యలు, ఉల్లిపాయలు, మజ్జిగ, పచ్చిమిర్చి వేసి వేయించండి. బాగా వేగిన తర్వాత  ఉడికించిన కాకరకాయల ముక్కల్ని గట్టిగా పిండి కూరలో వేయండి. పసుపు, ఉప్పు , కారం కలిపి ఎర్రగా వేగాక తరువాత గ్రేవీగా వచ్చాక దించేయండి. వైట్‌రైస్‌కు సైడిష్‌గా దీనిని వాడుకోవచ్చు. 

వెబ్దునియా పై చదవండి