క్యాన్సర్, అల్సర్, మెనోపాజల్ ప్రాబ్లమ్, గుండె సంబంధిత వ్యాధులను నయం చేసే క్యాప్సికమ్‌తో చికెన్ ఫ్రై ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.
తయారీ విధానం :
స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక నూనె వేడి చేసి ఉల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కల్ని వేసి వేపాలి. తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్ని, క్యాప్సికమ్ ముక్కల్ని చేర్చాలి. పూర్తిగా మెత్తబడనివ్వకుండా వేపాలి. ఈ క్యాప్సికమ్ మిశ్రమంలో పసుపు, కారంపొడి, ఉప్పు వేసి ముందే శుభ్రం చేసి ఉడికించిపెట్టుకున్న చికెన్ ముక్కల్ని చేర్చాలి.
చికెన్ ముక్కల్ని తడిపోయేంత వరకు వేయించి.. ఎండుమిర్చి పొడి, గరం మసాలా పొడి, మిరియాల పొడి వేసి కలుపుతూ వేయించాలి. చివర్లో సోయా సాస్ చేర్చి.. ఉప్పు తగినంత చేర్చుకుని దించేయాలి. క్యాప్సికమ్ చికెన్ ఫ్రై రెడీ అయినట్లే. ఈ ఫ్రైని అన్నంలోకి లేదా రోటీలకు, నూడుల్స్‌కు కూడా సర్వ్ చేయవచ్చు.