తయారీ విధానం :
ముందుగా ఓ వెడల్పాటి బౌల్లో చికెన్ కీమా, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పసుపు, కారం, గరం మసాలా, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం బాగా కలిపాలి. ఈ మిశ్రమాన్ని పది నిమిషాలు పక్కనబెట్టాలి. ఈ మిశ్రమాన్ని మీకు నచ్చిన షేపులో చేసుకుని పక్కనబెట్టుకోవాలి. స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక.. కొద్దిగా నూనె వేయాలి.