ఉల్లి తరుగు - అరకప్పు
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్
తయారీ విధానం:
బాణలిలో నూనె పోసి కాగా జీలకర్ర, కరివేపాకు, ఎండు మిర్చి చేర్చి పోపు పెట్టుకోవాలి. ఉల్లి తరుగు చేర్చాలి. తర్వాత పచ్చిమిర్చి, మునక్కాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, శుభ్రం చేసి వుంచిన చికెన్ ముక్కల్ని చేర్చి తగినంత నీటిలో ఉడికించాలి. కారానికి తగ్గట్టు మిరియాల పొడి చేర్చుకోవాలి. చికెన్, మునక్కాయలు బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర తరుగు చేర్చి దించేయాలి. అంతే డ్రమ్ స్టిక్ పెప్పర్ చికెన్ రెడీ. ఈ కూరను వేడి వేడి అన్నంలోకి లేదా రోటీలకు సైడిష్‌గా సర్వ్ చేస్తే టేస్టీగా ఉంటుంది.