అసలే వర్షాలు.. స్నాక్స్‌కు బదులు పోషకాలతో కూడిన ఆహారాన్ని మితంగా తీసుకోవాలని న్యూట్రీషన్లు అంటున్నారు. మధ్యాహ్న భోజనంలో ప్రోటీన్లు తప్పకుండా ఉండాలని చెప్తున్నారు. అలాంటి పోషకాలతో కూడిన ఆహారంలో కోడిగుడ్డు కూడా ఒకటి. హైకొలెస్ట్రాల్‌తో బాధపడేవారు వారానికి రెండో మూడో కోడిగుడ్లు మాత్రమే తీసుకోవాలి. కానీ ఎదిగే పిల్లలు రోజుకో గుడ్డు తీసుకోవాలి. ఇందులో విటమిన్ డి, బీ6, బీ12, జింక్, ఐరన్, కాపర్ ఉన్నాయి. అలాంటి కోడిగుడ్డుతో ఘాటు ఘాటుగా కోడిగుడ్డు కూర ట్రై చేయండి.
టమోటా తరుగు - అర కప్పు
పసుపు, కారం, ఉప్పు, నూనె- తగినంత
ధనియాల పొడి - ఒక స్పూన్
చింతపండు గుజ్జు - ఒక టీ స్పూన్
తయారీ విధానం :
ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి వేడయ్యాక అందులో నూనె వేయాలి. వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేగాక వెల్లుల్లి, ఉల్లి ముక్కలు వేసి దోరగా వేపాలి. ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కారం, ధనియాలపొడి వేసి మరో 3 నిముషాలపాటు ఉడికించాలి.