నూనె - సరిపడా.
తయారీ విధానం:
ముందుగా బాణలిలో నూనె వేడిచేసి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించుకోవాలి. ఆపై అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసువు, మాంసం వేసి బాగా కలుపుకుని మంచి వాసన వస్తుండగా కొద్దిగా నీరు పోసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసిన గోంగూరను వేసి బాగా ఉడికే వరకు చిన్న మంటపై ఉంచుకోవాలి. ఆపై దింపే ముందు గరం మసాలా, కొత్తిమీర వేసి 3 నిమిషాల పాటు అలానే ఉంచాలి. అంటే గోంగూర పీతలు రెడీ. ఈ కూరను వేడివేడి అన్నం కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.