మటన్‌లో ప్రోటీన్లు ఎక్కువ. ఇందులో జింక్, ఐరన్, సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఐరన్ శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. ఇందులోని విటమిన్ ఎ, బి, డీ దంతాలు, ఎముకలకు ఎంతో మేలు చేస్తుంది. అలాంటి మటన్‌తో కీమా బాల్స్ ఎలా చేయాలో చూద్దాం..
తయారీ విధానం :
ముందుగా మటన్ కీమాను ముందుగా శుభ్రం చేసి బాగా కడిగి తడిపోయే వరకు ఆరబెట్టాలి. మిక్సీలో సగం కొత్తిమీరను రుబ్బుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొద్దిగా నీరు వేసి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత కారం, ఉప్పు, మటన్ కీమా, ధనియాల పొడి వేసి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.