ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి వేడయ్యాక చెంచా నూనె వేయాలి. అందులో ఉల్లిపాయ, పాలకూర, పచ్చిమిర్చి తరుగు వేసి వేపుకోవాలి. అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేపుకుని పాన్‌ను దించేయాలి. ఒక గిన్నెలో ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా పొడి, చెంచాడు నీళ్లు వేసి కలిపి వేయించిన ఉల్లి, పాలకూర మిశ్రమం వేసి కలపాలి. ఇందులో గుడ్లు వేసి బాగా నురగ వచ్చేలా గిలక్కొట్టాలి. ఇందాకటి పాన్‌లో మిగతా నూనె వేసి వేడయ్యాక గుడ్డు మిశ్రమంతో కొద్దిగా మందంగా ఆమ్లెట్ వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే పాలకూరతో ఎగ్ ఆమ్లెట్ రెడీ..