సెక్సువల్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఎముకలను దృఢంగా చేసే రొయ్యలతో మసాలా రిసిపీని ఈ వీకెండ్ ట్రై చేయండి. రొయ్యల్లో క్యాల్షియం, లో కెలెరోలు, యావరేజ్ కొలెస్ట్రాల్, ఫాస్పరస్, కాపర్, మేగ్నిషియం ఉన్నాయి.
తయారీ విధానం:
ముందుగా శుభ్రం చేసుకున్న రొయ్యలకు వెల్లుల్లి, పసుపు, కారం, చింతపండు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి 15-30నిముషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి ఫ్రైయింగ్ పాన్ తీసుకొని, అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో లవంగాలు మరియు దాల్చిన చెక్క వేసి ఒకనిముషం వేగించుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి. 5నిముషాల తర్వాత అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న ప్రాన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి.