చేపల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు, డయాబెటిస్‌ను దూరం చేసుకోవాలనుకునేవారు, మెదడు చురుగ్గా పనిచేయాలనుకునే వారు వారానికి రెండు సార్లు చేపలతో కూడిన వంటకాలను తీసుకోవాలి. అలాంటి చేపలతో కూరలు చేసి బోర్ కొట్టేస్తుందా.. అయితే ఈ వజరం చేపల ఫ్రైని ఎలా చేయాలో ట్రై చేయండి.
కావలసిన పదార్థాలు :
వంజరం చేప ముక్కలు - అర కేజీ
అల్లం వెల్లుల్లి ముద్ద - పావు కప్పు,
గరం మసాలా, కారం, పసుపు - తలా అర స్పూన్,
నూనె, ఉప్పు - వేయింపుకు సరిపడా
తయారీ విధానం :
ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని ఓ పాన్‌లోకి తీసుకోవాలి. అల్లం, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు కలుపుకుని చేపలకు పట్టించి అరగంట పాటు పక్కనబెట్టేయాలి. అరగంట తర్వాత బాణలిలో నూనె వేడి చేసి మసాలాలో బాగా నానిన చేప ముక్కల్ని రెండువైపులా దోరగా కాల్చాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత ఫ్రై చేస్తే వంజరం చేపల ఫ్రై రెడీ..!