చికెన్ మేరీలాండ్

శుక్రవారం, 9 జనవరి 2009 (11:20 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
బాయిలర్ కోడి... ఒకటి
వెన్న... 50 గ్రాములు
కైమా... 500 గ్రాములు
మిరియాల పొడి... సరిపడా
ఆరెంజ్ జ్యాస్... ఒక కప్పు
ఉప్పు... సరిపడా
గుడ్లు... మూడు

తయారీ విధానం :
బాయిల్ చేసిన కోడిని శుభ్రం చేసి, లోపలి భాగంలోని అవయవాలను తొలగించాలి. దీనికి ఉప్పు, మిరియాల పొడి, ఆరెంజ్ జ్యూస్ బాగా పట్టేలా చేసి గంటసేపు అలానే పక్కన ఉంచాలి. తర్వాత బాణలిలో నూనె పోసి, వెల్లుల్లి ముక్కలు, కైమా వేసి బాగా ఉడికేదాకా వేయించాలి.

దీనికి తగినంత ఉప్పువేసి ఇతర మసాలా మిశ్రమాన్ని చికెన్ పొట్టలో కూరాలి. పొట్ట భాగంలోని చర్మాన్ని దారంతో కుట్టి... ఓవెన్‌లోని పెనంపైన కాస్తం వెన్నవేసి, కాగిన తరువాత ఆ కోడిని పెట్టి బాగా రోస్ట్ చేయాలి. అంతే చికెన్ మేరీలాండ్ సిద్ధమైనట్లే....!

వెబ్దునియా పై చదవండి