కావలసిన పదార్థాలు : నాటుకోడి మాంసం... ఒక కేజీ ఉల్లిపాయలు... రెండు ఎండుకొబ్బరి... 2 టీస్పూన్లు గసగసాలు... 2 టీస్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్... 2 టీస్పూన్లు ఉప్పు... సరిపడా పసుపు... సరిపడా
తయారీ విధానం : నాటుకోడి మాంసానికి చిటికెడు పసుపు కలిపి కాసేపు ఉడికించాలి. ఒక పాత్రలో నూనె వేడిచేసి, ఉల్లిపాయలను వేసి వేయించాలి. అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను కూడా దీనికి చేర్చి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించాలి.
తరువాత పై మిశ్రమంలో ఉడికించి ఉంచిన కోడిమాంసాన్ని కలిపి ఉడికించాలి. దీనికి రెండు కప్పుల నీటిని చేర్చి ఉడకనివ్వాలి. చివరగా కూర దింపేముందు కాస్తంత నిమ్మరసం కలుపుకోవాలి. అంతే నాటుకోడి షోరువా రెడీ.