కావలసిన పదార్థాలు : మటన్... అర కేజీ ఉల్లిపాయలు... నాలుగు వెల్లుల్లి... పది రెబ్బలు టొమోటో గుజ్జు... 125 గ్రా. పసుపు... అర టీ. కారం... అర టీ. ధనియాలపొడి... అర టీ. మెంతులు... అర టీ. మిరియాలు... రెండు ఉప్పు... తగినంత గరంమసాలా... అర టీ. నూనె... వేయించేందుకు సరిపడా
తయారీ విధానం : పాన్‌లో నూనె పోసి కాగిన తరువాత మెంతులు వేసి వేయించాలి. అందులోనే తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. టొమోటో గుజ్జు, మిరియాలు, పసుపు, కారం, ధనియాలపొడి, తగినంత ఉప్పు కూడా వేసి మరి కాసేపు ఉడికించాలి. తరువాత మటన్ ముక్కలు వేసి మధ్యమధ్యలో కలుపుతూ మూతపెట్టి మగ్గనివ్వాలి.
పది నిమిషాల తరువాత అరగ్లాసు నీళ్లు పోసి, తక్కువ మంటమీద మరో 20 నిమిషాలపాటు ఉడికించాలి. నీళ్లన్నీ ఆవిరైపోయాక కలుపుతూ మరికాసేపు వేయించాలి. తరువాత మళ్లీ అరగ్లాసు నీళ్లుపోసి మరో పదిహేను నిమిషాలు ఉడికించాలి. మటన్ బాగా ఉడికినట్లు అనిపిస్తే.. చివర్లో గరంమసాలాపొడి చల్లి దించేయాలి. అంతే పంజాబీ మటన్ కర్రీ సిద్ధమైనట్లే...!