ఆసీస్‌లో 21 శాతం తగ్గనున్న భారత విద్యార్థులు : సర్వే

FILE
ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియాకు వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య 21 శాతం మేరకు తగ్గనున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. జాత్యహంకార దాడుల భయంతోనే విద్యార్థుల సంఖ్య క్షీణిస్తోందనీ, భద్రతా కారణాల వల్లనే వారు ఆసీస్ వచ్చేందుకు విముఖత చూపుతున్నారని ఆ నివేదిక తెలిపింది.

ఆస్ట్రేలియా పర్యాటక శాఖ రూపొందించిన ఈ నివేదికలో 2010వ సంవత్సరంలో భారత్ నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య 21 శాతం పైబడి తగ్గనున్నట్లు పేర్కొంది. ఈ విషయమై పర్యాటక కమిటీ అధ్యక్షుడు బెర్నార్డ్ సాల్ట్ మాట్లాడుతూ.. విద్యార్థుల క్షీణతవల్ల ఆసీస్ సుమారు రూ.350 కోట్ల (70 మిలియన్ డాలర్లు) ఆదాయాన్ని నష్టపోతున్నట్లు అంచనా వేశారు.

వీసా పత్రాలను పరిశీలించిన మీదట ఈ నివేదికను రూపొందించినట్లు సాల్ట్ చెప్పారు. కాగా.. కనీసం 4 వేల మంది భారతీయ విద్యార్థులు తమ నిర్ణయాలను మార్చుకున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే... భారత విద్యార్థుల సంఘం అధ్యక్షుడు గౌతమ్ గుప్తా ఆసీస్ వాదనను తప్పుబట్టారు. దాడులవల్ల విద్యార్థుల సంఖ్య తగ్గినమాట వాస్తవమే అయినా అది 21 శాతానికే పరిమితమైందని అన్నారు.

వెబ్దునియా పై చదవండి