ఎన్నారైల ఓటుహక్కుపై సమాచారమేదీ లేదు: ఈసీ

FILE
ప్రవాస భారతీయులకు ఓటుహక్కు కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారమూ అందలేదని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. అయితే ఈ విషయమై ప్రభుత్వం నుంచి సమాచారం కోసం వేచిచూస్తున్నట్లు ఈసీ వెల్లడించింది.

ఇదే అంశంపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ నవీన్ చావ్లా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నారైలకు ఓటుహక్కు కల్పిస్తామని ప్రధానమంత్రి చెప్పినట్లుగా మీడియా ద్వారా తెలుసుకున్నాన్నట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం అందగానే తదుపరి కార్యాచరణ చేపడతామని ఆయన వివరించారు.

ఇదిలా ఉంటే.. న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన ప్రవాసీ భారతీయ దివస్‌లో పాల్గొన్న ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ, 2014 లోక్‌సభ ఎన్నికల నాటికి ప్రవాస భారతీయులకు ఓటుహక్కు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి