గల్ఫ్ ప్రవాసులను ఆదుకోవాలి : వాయలార్ రవి

FILE
గల్ఫ్ దేశాలలో వీసా సమస్యలతో సతమతమవుతున్న భారతీయులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రవాస వ్యవహారాల శాఖా మంత్రి వాయలార్ రవి అభిప్రాయపడ్డారు. యూఏఈలోని పలు దేశాలలో పనిచేస్తున్న భారతీయ కార్మికుల ప్రయోజనాలను కాడాలని ఆయన అన్నారు.

దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ సమావేశంలో గురువారం మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత కార్మికులకు ఉపాధి కల్పించిన సంస్థలు వీసా గడువు పరిమితులను నిర్ణీత సమయంలోగా పొడిగించక పోవటం వల్లనే.. వారు అక్రమంగా నివసించాల్సిన పరిస్థితి ఎదురవుతోందన్నారు.

కాబట్టి.. కార్మికులు కంపెనీల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సి ఉందని రవి పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల్లో తమ పౌరులు ఎదుర్కొంటున్న కష్టాలను దూరం చేసేందుకు యూఏఈ కార్మిక సహాయం అందించాలని ఈ మేరకు ఆయన అక్కడి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

వెబ్దునియా పై చదవండి