తానా "బ్యాక్ ప్యాక్" పథకానికి ప్రశంసలు

FILE
అమెరికాలోని పేద విద్యార్థుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రవేశపెట్టిన "బ్యాక్ ప్యాక్" పథకంపై వోర్సెస్టర్ మేయర్ కాన్ట్సాంటిన లూక్స్ హర్షం వ్యక్తం చేశారు. వోర్సెస్టర్‌లో నిర్వహించిన బ్యాక్ ప్యాక్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లూక్స్.. తానా సేవలను కొనియాడారు.

పేద విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు, ఇతర బోధనా సామగ్రిని తన చేతులమీదుగా పంపిణీ చేసిన లూక్స్.. ప్రజలకు మేలు చేసే ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన తానా సంస్థను ప్రశంసించారు. ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు కోమటి జయరాం మాట్లాడుతూ.. ఈ పథకాన్ని అమెరికాలోని అన్ని రాష్ట్రాలలోనూ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో బోస్టన్, వోర్సెస్టర్ నగరాలలో 550 మంది విద్యార్థులకు బ్యాక్ ప్యాక్‌లను పంపిణీ చేసినట్లు తానా సంస్థ ప్రతినిధులు ఇదే సందర్భంగా వెల్లడించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రజా సంక్షేమం కోసం పాటుపడే పలువురు పెద్దలు, ఆ ప్రాంత రాజకీయ నాయకులు పాల్గొని.. తానా ఇలాంటి మరిన్ని ప్రజాసంక్షేమ కార్యక్రమాలను చేపట్టి, ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.

వెబ్దునియా పై చదవండి