దాడులు గర్హనీయం : కెవిన్ రూడ్

భారతీయులపై తమ దేశంలో జరిగిన దాడులు గర్హనీయమని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి కెవిన్ రూడ్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి మాట్లాడిన ఆయన... దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

వరుసగా భారతీయులపై జరుగుతున్న దాడుల గురించి భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో తాను మాట్లాడానని రూడ్ వెల్లడించారు. దాడులను ఆపేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మన్మోహన్ తనను ఫోన్లో కోరారని... దాడుల విషయంపై ప్రభుత్వం కూడా చర్చిస్తోందని, త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని రూడ్ తెలిపారు.

ఆస్ట్రేలియాలో ఉంటున్న 90 వేలమంది భారతీయ విద్యార్థులను అతిథులుగా గౌరవించి, వారిని కాపాడల్సిన బాధ్యత తమ ప్రభుత్వానిదేనని రూడ్ పునరుద్ఘాటించారు. కాగా... భారత విద్యార్థులపై వరుసగా జరుగుతున్న దాడులతో దేశ ప్రతిష్ట దెబ్బతింటోందని ప్రతిపక్ష నేత టర్నబుల్ ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తడంతో కెవిని రూడ్ పై విధంగా స్పందించారు.

వెబ్దునియా పై చదవండి