నిజంగా ఇదంతా బంగారమేనా..? : కెనడా ప్రధాని

FILE
ఇటీవల అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన కెనడా ప్రధానమంత్రి స్టీఫెన్ హార్పర్.. ఇదంతా నిజంగా బంగారమేనా..? అంటూ ఆశ్చర్యపోయారట. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న ప్రతినిధి బృంద సభ్యుడు, ఎన్నారై బిరిందర్ సింగ్ అహ్లూవాలియా ఈ విషయాన్ని వెల్లడించారు.

మండుటెండలో తళతళా మెరిసిపోతున్న స్వర్ణ దేవాలయాన్ని చూసిన హార్పర్ ఒక్కసారిగా ఆశ్చర్యచకితులయ్యారనీ అహ్లూవా తెలిపారు. ఇదంతా నిజంగా బంగారమేనా అంటూ హార్పర్ అడిగిన ప్రశ్నకు పక్కనున్న సిబ్బంది అచ్చంగా బంగారందేనని సమాధానం ఇచ్చినట్లు ఆయన వివరించారు. అనంతరం హార్పర్ స్వర్ణదేవాలయం అందాలను తనివితీరా ఆస్వాదించారని అన్నారు.

ఇదిలా ఉంటే.. టొరంటోకు చెందిన ఆహ్లూవాలియా కెనడాలో అతిపెద్ద డయాగ్నస్టిక్ సెంటర్‌ను నడుపుతున్నారు. 25 సంవత్సరాల క్రితం అమృత్‌సర్ నుంచి కెనడాకు వలసవెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కెనడా ప్రధాని సందర్శన గురించి ఆయన మాట్లాడుతూ... వేలాదిమంది స్థానిక ప్రజలు హార్పర్‌కు ఘన స్వాగతం పలికారన్నారు.

వెబ్దునియా పై చదవండి