నిధుల సేకరణలో "జీహెచ్‌హెచ్ఎఫ్"

FILE
ప్రపంచవ్యాప్తంగా ఉండే ఆలయాల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న "గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ (జీహెచ్‌హెచ్‌ఎఫ్)" సంస్థ నిధుల సేకరణకు పూనుకుంది. ఇందుకోసం డిసెంబర్ 6వ తేదీన ఓ గొప్ప సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. న్యూజెర్సీ రాష్ట్రంలోని బ్రిడ్జివాటర్ నగరంలో ఉండే శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఆ రోజంతా జరుగనున్నాయి.

ఈ విషయమై జీహెచ్‌హెచ్ఎఫ్ ప్రతినిధి సత్యనేమన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా వసూలయ్యే నిధులను ఆలయాల పరిరక్షణ కార్యక్రమాల నిర్వహణ కోసం వినియోగించనున్నట్లు వివరించారు. అలాగే న్యాయ విరుద్ధంగా జరిగే పలు ఆలయాల ఆస్తుల విక్రయాలను నిలిపివేసేందుకు హైకోర్టులో తమ సంస్థ నడుపుతున్న కేసు ఖర్చులకు కూడా ఈ నిధులను వినియోగిస్తామని సత్యనేమన పేర్కొన్నారు.

కాబట్టి.. బృహత్తర కార్యం కోసం తలపెడుతున్న ఈ సాంస్కృతిక కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో ప్రవాస భారతీయులు హాజరై విజయవంతం చేయాలని సత్యనేమన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేవారు 50, 25, 10 డాలర్లను ఆన్‌లైన్‌లో కమ వెబ్‌సైట్‌కు విరాళంగా చెల్లించవచ్చని అన్నారు. కాగా.. ఇందులో పాల్గొనే 8 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రవేశం ఉచితమనీ... వేదిక వద్ద 12 డాలర్లను చెల్లించి కూడా నేరుగా ఈ కార్యక్రమానికి హాజరు కావచ్చని సత్యనేమన తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి