బ్రిటన్‌ నూతన ఇండియన్ హైకమీషనర్‌గా సూరి

FILE
బ్రిటన్‌లో భారతీయ హై కమీషనర్‌గా నళిన్ సూరి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ ఈ పదవిలో ఉన్న శివశంకర ముఖర్జీ పదవీ విరమణ చేయటంతో నళిన్ సూరి హై కమీషనర్‌గా ఎంపికయ్యారు. త్వలోనే బ్రిటన్ రాణి ఎలిజబెత్ "లెటర్ ఆఫ్ క్రెడెన్స్"ను కూడా సమర్పించనున్నారు.

నళిన్ సూరి 1973 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారి. ఈయన బ్రిటన్‌లో ఇండియన్ హై కమీషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టక మునుపు భారత్‌లోని న్యూఢిల్లీలోగల విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శి హోదాలో పనిచేశారు.

హాంకాంగ్, బ్రస్సెల్స్, దార్-ఎస్-సలాం, థింపూ ప్రాంతాలలో గల పలు భారత సంస్థల్లో కూడా నళిన్ సూరి విధులు నిర్వర్తించారు. అలాగే న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి శాశ్వత ప్రతినిధిగానూ, వార్సా రాయబారిగానూ, బీజింగ్ రాయబారిగానూ నళిన్ సూరికి విశేష అనుభవం ఉండటం విశేషంగా చెప్పవచ్చు.

వెబ్దునియా పై చదవండి