భారతీయులపై దాడులకు వాన్ రూడ్ నిరసన..!

FILE
ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార దాడులకు నిరసనగా మెల్‌బోర్న్‌లో జరిగిన ప్రదర్శనలో ఆ దేశ ప్రధానమంత్రి కెవిన్ రూడ్ తమ్ముడి కుమారుడు వాన్ రూడ్ పాల్గొన్నారు. శ్వేత జాత్యహంకారి వేషం వేసుకుని ఆందోళనలో పాల్గొన్న వాన్ రూడ్ దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కాగా... దేశ వ్యవస్థాపక దినోత్సవం (జనవరి 26వతేదీ) రోజున జరిగిన ఈ ప్రదర్శనపై ఆసీస్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రదర్శన విరమించాలంటూ ఆందోళనాకారుల్ని హెచ్చరించారు. ఎంత చెప్పినా ఆందోళనకారులు మాటవినక పోవటంతో వాన్ రూడ్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఆయనపై జరిమానా కూడా విధించారు.

ఇదిలా ఉంటే... జనవరి 28వ తేదీన లండన్‌లో ఆప్ఘనిస్తాన్ సమస్యలపై జరుగునున్న సదస్సులో భారత విదేశాంగ శాఖా మంత్రి ఎస్.ఎం. కృష్ణ, ఆస్ట్రేలియా విదేశాంగ శాఖామంత్రి స్టీఫెన్ స్మిత్ పాల్గోనున్నారు. ఈ సందర్భంగా భారతీయులపై జరుగుతున్న దాడులను అరికట్టాల్సిన ఆవశ్యకత గురించి కృష్ణ, స్మిత్‌తో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి