భారత కళాఖండాలకు లండన్‌లో విశేష ఆదరణ

భారతదేశానికి చెందిన చిత్రకారులు లండన్‌లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలకు అక్కడి కళాభిమానుల నుండి విశేషమైన స్పందన లభిస్తోంది. లండన్ నగరంలోని స్థానిక నెహ్రూ సెంటర్‌లో గల "సింఫనీ ఆఫ్ కలర్స్" అనే పేరుతో ఏర్పాటు చేసిన ఈ కళా ప్రదర్శనలో అనేక విభిన్నమైన కళా రూపాలను ప్రదర్శిస్తున్నారు.

ఈ సందర్భంగా సింఫనీ ఆఫ్ కలర్స్ ప్రదర్శన నిర్వాహకులు, ఔత్సాహిక చిత్రకారులు అయిన నీతిక గార్గ్ మాట్లాడుతూ... భారతీయ చిత్రకారుల కళాల నుంచి జాలువారిన విశేషమైన కళారూపాలు అభిమానులకు కనువిందు చేస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.

మంచి ప్రతిభ కలిగిన కళాకారులను గుర్తించి, వారికి ప్రపంచవ్యాప్తంగా తగిన గుర్తింపు తేవాలన్న లక్ష్యంతో ఈ సింఫనీ ఆఫ్ కలర్స్ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు నీతిక గార్గ్ వెల్లడించారు. తమ ఈ ప్రదర్శనలో ప్రముఖ చిత్రకారులు మిలాంద్ ములిక్, చిత్రా సింగ్, ప్రేమ్‌సింగ్, నీలాద్రి పాల్, రాహుల్ దేశ్‌ పాండే, మిలిబాండ్ నాయక్, భీమ్ మల్హోత్రా... తదితరులు రూపొందించిన చిత్రాలను కొలువుదీర్చినట్లు నీతిక పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి