హత్య కేసులో దుబాయ్‌లో భారతీయునికి ఉరిశిక్ష!!

సహ కార్మికుని హత్య చేసిన కేసులో ఓ భారతీయుడికు దుబాయ్ కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఇదే కేసుతో సంబంధం ఉన్న మరో 11 మందికి జీవితఖైదు విధించింది.

2009 సంవత్సరంలో సహ కార్మికుని కొందరు కార్మికులు మద్యం మత్తులో చిత్రహింసలు పెట్టి, హత్య చేశారని వారిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసును విచారించిన దుబాయ్ కోర్టు పంజాబ్‌కు చెందిన మేజర్ సింగ్ అనే వ్యక్తికి మరణశిక్ష పడగా, మరో 11 మందికి జీవిత శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

అలాగే, ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక పాకిస్థాన్ జాతీయుడుకి కూడా జీవితశిక్షను విధించింది. సహ కార్మికుల చేతిలో హత్యకు గురైన వ్యక్తి కేరళకు చెందిన కార్మికుడు. అయితే, అతని వివరాలు వెల్లడించడానికి నిరాకరిస్తున్నారు. భారతీయుల తరపున కేసును వాదించిన ఒబెరాయ్ వారికి శిక్ష పడిన విషయాన్ని ధ్రువీకరించారు.

వెబ్దునియా పై చదవండి