జోక్‌ను వివాదం చేయవద్దు : అతుల్ పటేల్

FILE
బ్రిటన్ రాణి ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్ జోక్ చేయడాన్ని వివాదం చేయవద్దని, ఈ విషయాన్ని ఇంతటితో ఆపివేయాలని.. ప్రముఖ ప్రవాస భారతీయ వ్యాపారవేత్త అతుల్ పటేల్ విజ్ఞప్తి చేశారు. ఆయన పలుకరింపులో తప్పేమీ లేదనీ.. ఊరికే ఈ విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఇదిలా ఉంటే.. సోమవారం రాత్రి లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్‌కు ఎలిజబెత్ రాణి దంపతులు ఇచ్చిన విందు ఇచ్చారు. ఈ విందు కార్యక్రమంలో పటేల్ పేరుతో ఫిలిఫ్ జోక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విందుకు 400 మంది భారత సంతతి ప్రముఖులు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి హాజరైన అతుల్ పటేల్‌ను పలుకరించిన ఫిలిప్.. "ఇక్కడ మీ కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నారే..!!" అంటూ జోక్ చేశారు.

ఈ విషయంపై అతుల్ పటేల్ మాట్లాడుతూ.. "ఫిలిప్ చేసిన వ్యాఖ్యలో తప్పేమీ లేదు. దీన్ని వివాదం చేయాల్సిన అవసరమూ లేదు. మంచి మనసుతో అర్థం చేసుకుంటే ఎలాంటి వివాదానికీ తావుండదు. బ్రిటీష్ ఇండియన్‌గా బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో విందుకు హాజరవటం గర్వంగా భావిస్తున్నానని" అన్నారు. కాగా.. బ్రిటన్‌లోని భారత సంతతి ప్రజల్లో సింగ్ తర్వాత ఎక్కువమందికి ఉన్న పేరు పటేల్. అక్కడ 6.70 లక్షల మందికి వారి పేరులో పటేల్ కలిసి ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి