టీసీఏ ఆధ్వర్యంలో "తెలుగు సాహితీ సభ"

FILE
తెలుగు సాంస్కృతిక సమితి (టీసీఏ) ఆధ్వర్యంలో హోస్టన్‌లో జరిగిన తెలుగు సాహితీ సభ కార్యక్రమం ఆద్యంతం సాహిత్యాభిమానులను అలరించింది. స్థానిక ఆర్యసమాజ్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు ప్రముఖులతో పాటు 200 మందికిపైగా ప్రవాస తెలుగువారు పాల్గొని, సభను విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా టీసీఏ అధ్యక్షులు రామ పాకల మాట్లాడుతూ... తెలుగు భాషను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం సీతారాం అయ్యగారి వేద ప్రవచనాల నడుమ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులను ఆటా అధ్యక్షులు జితేందర్ రెడ్డి, భాస్కరరావు ముత్యాలలు బహమతులతో సత్కరించారు.

కాగా... టీసీఏ సాంస్కృతిక కార్యదర్శి రాజరాజేశ్వరి కలగ ప్రార్థనా గీతాలాపనతో ప్రారంభమయిన ఈ కార్యక్రమంలో అక్కిరాజు పాడిన పద్యాలు ప్రేక్షకులను అలరించాయి. ఇక సినీ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ, గోరటి వెంకన్న, అందెశ్రీలు ఆలపించిన గీతాలు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టాయి, ఆలోచింపజేశాయి. అలాగే బాపురెడ్డి వినిపించిన కవిత నవ్వులు పూయించింది.

ఆ తరువాత ప్రముఖ అవధానులు మేడసాని మోహన్, రాళ్లబండి కవితా ప్రసాద్‌ల అష్టావధానం.. వంగూరి చిట్టెన్ రాజు, సత్యభామపప్పు, మురళి అహుబల, మల్లిక్ పుచ్చా, వసంత పుచ్చా, సుదేశ్ పిల్లుట్ల, సాయి రాచకొండ, శ్రీరామ్ చెరువు, అక్కిరాజు సుందరరామకృష్ణలు నిర్వహించిన కార్యక్రమాలతో సాహితీ సభ ముగింపువరకూ చాలా ఆసక్తికరంగా కొనసాగింది.

వెబ్దునియా పై చదవండి