దాడుల నియంత్రణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్

FILE
ఆస్ట్రేలియాలో గత కొంతకాలంగా భారతీయ విద్యార్థులపై జరుగుతున్న జాత్యహంకార దాడులను అరికట్టేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు నేతృత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేసినట్లు.. కేంద్ర ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రి వయలార్ రవి పేర్కొన్నారు.

జాత్యహంకార దాడుల విషయమై రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు రాసిన ఓ లేఖకు సమాధానమిచ్చిన వయలార్ రవి పై విషయాన్ని వెల్లడించారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియా ప్రభుత్వం ప్రత్యేకంగా "కమ్యూనిటీ రెఫరెన్స్ గ్రూపు"ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తన సమాధానంలో తెలియజేశారు.

ఆస్ట్రేలియాలోని భారతీయులకు భద్రతాపరమైన అంశాలను వివరించేందుకుగానూ ఈ కమ్యూనిటీ రెఫరెన్స్ గ్రూపును ప్రారంభించినట్లు వయలార్ రవి తెలిపారు. ప్రత్యేకంగా హాట్‌లైన్‌ను ఏర్పాటు చేసిన ఈ గ్రూప్... బాధిత భారతీయ విద్యార్థులకు వివిధ విషయాలలో అండగా నిలుస్తున్నట్లు ఆయన వివరించారు.

వెబ్దునియా పై చదవండి