మలేషియా పీఎమ్‌కు "ఎమ్ఐసీ" ప్రశంస

మలేషియా నూతన ప్రధానమంత్రి నజీబ్ తున్ రజాక్ పనితీరుపట్ల ప్రవాస భారతీయులందరూ సంతృప్తిగా ఉన్నట్లు మలేషియన్ ఇండియన్ కాంగ్రెస్ (ఎమ్ఐసీ) సంతోషం వ్యక్తం చేసింది. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు పూనుకున్న పీఎమ్ పనితీరును ఎమ్ఐసీ ఈ సందర్భంగా ప్రసంశించింది.

ఈ మేరకు ఎమ్ఐసీ అధినేత సామివేలు మీడియాతో మాట్లాడుతూ... ఉపాధి రంగాలతోపాటు పలు రంగాలలో ప్రవాసులకు అవకాశాలను కల్పిస్తామని చెప్పిన ప్రధాని ప్రకటనను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ప్రధాని నుంచి ప్రవాసులు మరిన్ని వరాలు కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రధాని రజాక్ పనితీరుపట్ల తమ ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారని సామివేలు చెప్పారు. భిన్న సంస్కృతులకు నిలయమైన మలేషియాలో అందరికీ ఉపాధిని కల్పించేందుకు పూనుకున్న ప్రధానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రవాస భారతీయులలో పేదల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ప్రధాని చేస్తున్న కృషిని మరువజాలమని సామివేలు అన్నారు.

వెబ్దునియా పై చదవండి