స్ట్రాపోల్స్‌లో బాబీ జిందాల్ హవా

భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నేత, లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ అమెరికా రాజకీయాల్ల ప్రగాఢమైన శక్తిగా ఎదుగుతున్నారు. ఈ మేరకు 2012లో దేశాధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన "స్ట్రాపోల్స్" (విధిగా పాటించాల్సిన అవసరం లేనివి)లో జిందాల్ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

కన్సర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కన్వెన్షన్ (సీపీఏసీ) మొత్తం 1,757 అభ్యర్థిత్వాలకు నిర్వహించిన ఈ స్ట్రాపోల్స్‌లో... మసుచూసెట్స్ మాజీ గవర్నర్ మిట్ట్ రోమెనీ 20 శాతం ఓట్లతో తొలి స్థానాన్ని కైవసం చేసుకోగా, 14 శాతం ఓట్లతో జిందాల్ తర్వాతి స్థానంలో నిలిచారు.

ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీతో పాటుగా అమెరికా రాజకీయాల్లో జిందాల్ కీలక వ్యక్తిగా ఎదుగుతున్నారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇదిలా ఉంటే... ఈ ఫలితాలలో టెక్సాస్‌కు చెందిన కాంగ్రెస్ నేత రాన్‌పాల్, అలస్కా గవర్నర్ సారా పాలిన్‌లు 13 శాతం ఓట్లతో తృతీయ స్థానంలో నిలవడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి