ఘనంగా కెసిఆర్ మరియి తెరాస మద్దతుదారుల సంఘం ఏర్పాటు(ఫోటోలు)

మంగళవారం, 13 డిశెంబరు 2016 (17:24 IST)
లండన్‌లో కెసిఆర్ మరియి తెరాస మద్దతుదారుల సంఘం KTSUK ( KCR & TRS SUPPORTERS UK ) ఏర్పాటు ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి యుకే నలుమూలల నుండి సుమారు 150 మందికి పైగా తెలంగాణ కుటుంబ సభ్యులు తెరాస శ్రేణులు హాజరయినారు. ముందుగా జయశంకర్ గారి చిత్ర పటానికి పూలతో నివాళులర్పించి, జయశంకర్ గారిని స్మరిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.
 
సభ అధ్యక్షత వహించిన నగేష్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ 2002 నుండి కెసిఆర్ గారి ఆలోచనలకు, వారి పిలుపు మేరకు అనేక కార్యక్రమాల్లో పాల్గొని గత 5 ఏండ్లుగా లండన్‌లో తెలంగాణ ఉద్యమంలో తెరాస పక్షాన తనవంతు బాధ్యత వహించాము. తెరాసకి మద్దతుగా యూకే మరియు యూరప్ దేశాల్లో తెలంగాణ ప్రజలను ఏకం చేసి బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యులను చేయడానికి  ప్రజాస్వామ్యబద్దంగా తమవంతు కృషి చేయడానికి పూర్తి కార్యాచరణతో ముందుకు వెళ్తామని వివరించారు. 
 
ఈ సందర్భంగా వ్యవస్థాపక సభ్యులు సిక్కా చంద్రశేఖర్ గారు సంస్థ యొక్క ఆశయాలని భవిష్యత్ కార్యాచరణ ప్రెజెంటేషన్‌తో వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను ప్రారంభం చేయాలన్న తాము పెట్టుబడులు పెట్టే వారికీ మరియు తెరాస గవర్నమెంట్‌కి వారదులుగా పని చేస్తూ చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతంగా అమలు జరిగే విధంగా తమ సంస్థ పనిచేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
 
తమ సంస్థ NRI లో ఒక కొత్త ఒరవడితో ముందుకు వెళ్తుందని, సంస్థలో తారతమ్యాలు లేకుండా కేవలం NRIలకు మరియు తెరాస పార్టీకి వారధిగా పనిచేస్తుందని, ఇక్కడ స్థిరపడిన NRI తమతమ స్వగ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేసేందుకు వారికి తోడుగా ఉంటుందని, అంతేకాకుండా ఇక్కడున్న NRIలకు సంబంధించిన హెల్త్ లేదా వివిధ సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే తప్పకుండా తమ సంస్థ నుంచి తగిన సహాయం చేస్తామని సంస్థ సభ్యులు ప్రమోద్ అంతటి, వెంకట్ రంగు, భాస్కర్ పిట్టల, కృష్ణ, సురేష్ గోపతి, శశిరాజ్ మర్రి , గోలి తిరుపతి, నరేష్ మర్రియాల, రుద్రా శ్రీనివాస్, శివ నరపాక, రఘు గౌడ్, జయంత్ వడిరాజు, లక్ష్మి నరసింహారెడ్డి వెల్లడించారు. 
 
ముఖ్య అతిథిగా హాజరైన రాస్తాం కౌన్సిలర్ పాల్ సథానిసేం సంస్థ స్థాపన ఆశయాలు ఆలోచనలు ప్రశంసనీయం అని అన్నారు. తను కూడా సంస్థతో కీలక భాగస్వామి కానున్నట్లు తెలిపారు. ఇంకా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్, జాగృతి, హైదరాబాద్ ఫ్రెండ్స్ అసోసియేషన్ మరియు వివిధ తెలంగాణ తెలుగు సంస్థలు ప్రతినిధులు కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేశారు.

వెబ్దునియా పై చదవండి