ఎన్నారై విద్యార్థినికి "బ్రిటన్ పోలీస్ అవార్డ్"

లీచెష్టర్‌ యూనివర్సిటీలో న్యాయశాస్త్ర విద్యనభ్యసిస్తోన్న భారత సంతతి విద్యార్థిని మిలిస్సా మహరాజ్‌ "బ్రిటన్ పోలీసు అవార్డు"కు ఎంపికయ్యింది. సహచర విద్యార్థుల ప్రయోజనాల కోసం ఈమె చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును బహూకరించినట్లు లీచెష్టర్ వర్సిటీ ప్రకటించింది.

లీచెష్టర్‌లోని వెల్‌ఫోర్డ్ రోడ్ పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ రిచర్డ్ టూనీ చేతుల మీదుగా మిలిస్సా ఈ అవార్డును అందుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తనకు ఈ గౌరవం దక్కుతుందని అస్సలు ఊహించలేదని సంతోషం వ్యక్తం చేసింది. తనకీ అవార్డు ఇచ్చినందుకు ఆమె అందరికీ కృతజ్ఞతలను తెలియజేసింది. స్థానిక పోలీసులు, యూనివర్సిటీ సహకారంతోనే తాను సాటి విద్యార్థులకు సహాయపడ్డానని మిలిస్సా తెలిపింది.

ఇదే సందర్భంగా... క్యాంపస్ పార్క్ పోలీస్ అధికారి హార్వే వాట్సన్ మాట్లాడుతూ... తమకు, విద్యార్థులకు సన్నిహితంగా పనిచేయడంద్వారా మిలిస్సా మంచి ఫలితాలను సాధించిందనీ, తద్వారా కొంతమంది విదేశీ విద్యార్థులకు ఎంతో మేలు జరిగిందని ప్రశంసించారు. సహచర విద్యార్థులకు అందించే సేవలను గుర్తించి తానే ఆమెను నామినేట్ చేశానని చెప్పారు. ప్యానల్ కూడా ఏకగ్రీవంగా ఈ అవార్డును మిలిస్సాను ఎంపిక చేసిందని ఆయన వివరించారు.

వెబ్దునియా పై చదవండి