కెనడియన్ సిక్కు యువతి మృతి : వీడని మిస్టరీ

మలేషియాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన కెనడియన్ సిక్కు యువతి కేసులో.. అక్కడి పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేక పోయారు. అక్టోబర్ 5వ తేదీన కాల్‌గారీ ప్రాంతంలో హర్‌సిమ్రత్ ఖహలాన్ అనే 27 సంవత్సరాల యువతితోపాటు ముగ్గురు శిశువులు మృతి చెందిన సంగతి తెలిసిందే.

అయితే ఖహలాన్‌తోపాటు మృతి చెందిన ముగ్గురు శిశువులు ఆమెకు పుట్టినవారో, కాదోనన్న విషయం ఇప్పటిదాకా ఎటూ తేలలేదు. ఆమె మరణించి ఇన్నిరోజులు గడుస్తున్నా అక్కడి పోలీసులు ఈకేసు మిస్టరీని ఛేదించలేకపోయారు. ఇదిలా ఉంటే.. భారత్‌లోని చండీగఢ్‌కు చెందిన ఖహలాన్ 1999లో మలేషియాకు వలస వెళ్లింది.

ఆ తరువాత నాలుగు సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యుల నుంచి విడిపోయిన ఖహలాన్.. హర్నెక్‌మహల్ అనే వ్యక్తితో కలిసి జీవిస్తోంది. అక్క్డి ఆసుపత్రి రికార్డుల ప్రకారం 2005వ సంవత్సరంలో ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సంగతలా పక్కనపెడితే ఖహలాన్ పెళ్లి చేసుకునేందుకు నవంబర్ నెలలో భారత్ రావాల్సి ఉంది.

వెబ్దునియా పై చదవండి