ప్రణీత్ కౌర్‌కు "సిక్క్ ఆఫ్ ది ఇయర్" అవార్డు

FILE
భారత విదేశాంగఖాశ వ్యవహారాల సహాయమంత్రి ప్రణీత్ కౌర్.. 2009 సంవత్సరానికిగానూ సిక్కులకు ఇచ్చే ప్రతిష్టాత్మక "సిక్క్ ఆఫ్ ది ఇయర్" అవార్డుకు ఎంపికయ్యారు. కాగా.. పంజాబ్ రాష్ట్రానికి విశేషంగా సేవలు అందించిన వ్యక్తులగానూ ఈ అవార్డును ప్రతి సంవత్సరం అందజేస్తారు.

లండన్‌లోని హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో జరిగిన అంతర్జాతీయ సిక్కుల ఫోరం నిర్వహించిన ఓ సమావేశంలో సిక్క్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రణీత్ కౌర్‌కు ప్రముఖ వ్యాపారవేత్త లార్డ్ ఇల్తాఫ్ షేక్ అందజేశారు. ఈ సమావేశానికి అక్కడి లిబరల్ డెమోక్రాట్ ఉప నాయకుడు లార్డ్ నవనీత్ ధోలకియా కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా లార్డ్ ఇల్తాఫ్ షేక్ మాట్లాడుతూ.. పంజాబ్ అభివృద్ధి ఎంతగానో కృషిచేసిన ప్రణీత్‌కు ఈ అవార్డు లభించడం సముచితమని అన్నారు. ఇదే సందర్భంగా ప్రణీత్ కౌర్ మాట్లాడుతూ.. గతంలో తాను ఎన్నోరకాల అవార్డులను, రివార్డులను అందుకున్నప్పటికీ, ఈ సిక్క్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మాత్రం ఎంతో విలువైనదని సంతోషం వ్యక్తం చేశారు.

ఇంకా ఈ సమావేశంలో లార్డ్ విస్కౌంట్ స్లిమ్, జస్టిస్ మోటా సింగ్, రంజిత్ సింగ్, ఓబీఈ, ఫోరమ్ ప్రెసిడెంట్, ఆర్ఎస్ బాక్సీ, సురీందర్ ఔజ్లా, రామీ రాంగర్ తదితరులు పాల్గొని, కౌర్‌కు అభినందనలు తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి