ఫార్చ్యూన్-500 జాబితాలో ఇంద్రానూయీ

ప్రపంచవ్యాప్తంగా ఉండే అత్యంత ప్రముఖమైన కంపెనీల జాబితా అయిన ఫార్చ్యూన్-500లలో భారతీయ సంతతి మహిళా వ్యాపారవేత్త, పెప్సికో అధినేత్రి స్థానం సంపాదించారు. టాప్ 15 మంది మహిళా సీఈఓలలో ఒకరిగా చోటు దక్కించుకున్న ఈమె... గత సంవత్సరం కూడా ఈ విభాగంలో నిలిచారు.

కాగా... ఈ ఫార్చ్యూన్-500 కంపెనీల జాబితాలో పెప్సికోకు ఈదఫా 175వ స్థానం లభించింది. గత సంవత్సరం పార్చ్యూన్-500 కంపెనీలలోని మహిళా సీఈఓల సంఖ్య ఈసారి 15కు పెరిగిన విషయం గమనార్హం. ఇదిలా ఉంటే... మహిళలు సీఈఓలుగా ఉన్న కంపెనీలలో అగ్రికల్చర్ ప్రాసెసింగ్ కంపెనీ ఆర్చర్ డేనియల్ మిడ్‌లాండ్ ప్రథమ స్థానంలో నిలిచారు.

2006వ సంవత్సరం నుంచి పెప్సికో సంస్థ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఇంద్రా నూయి, 13.4 మిలయన్ల వృద్ధి రేటుతో ఆ కంపెనీని ముందుకు తీసుకువచ్చారు. 2008లో 10 శాతం వృద్ధి రేటుతో 43.3 బిలియన్ల పెప్సికోకు ఆదాయం లభించటంలో నూయీ పాత్ర చెప్పుకోదగ్గది.

మహిళా వినియోగదారులను ఆకర్షించే రీతిలో నూయీ... స్మార్ట్ ఫుడ్ పేరుతో లో ఫ్యాట్ పాప్‌కార్న్ క్లస్టర్స్, లో కెలోరి ట్రాప్ 50, స్టార్‌బక్స్ ఫ్రాప్పుసినో లైట్ తదితర ఆహార పదార్థాలను వినియోగంలోకి తీసుకువచ్చారు. రాబోయే మూడేళ్ల కాలంలో పెప్సీ సంస్థ సేల్స్‌ను మరింతగా అభివృద్ధి చేసేందుకు సాఫ్ట్‌డ్రింక్‌‌లకుగానూ కోసం 1.2 బిలియన్ డాలర్లను ఉత్తర అమెరికాలో ఖర్చుచేయనుంది.

వెబ్దునియా పై చదవండి