బ్రిటన్, సైప్రస్ పర్యటన మరపురానిది : ప్రతిభ

FILE
బ్రిటన్, సైప్రస్ దేశాల ఏడు రోజుల పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి తిరిగివచ్చిన భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్.. ఆ రెండు దేశాల పర్యటన మరపురానిదని సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం న్యూఢిల్లీ చేరుకున్న రాష్ట్రపతి...మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఇండియా హౌస్‌లో జరిగిన విందును తాను మరచిపోలేనని, అలాగే మన మిత్రదేశమైన సైప్రస్‌ ఆతిథ్యం కూడా అమోఘమని అభివర్ణించారు.

ఇండియా హౌస్‌లో జరిగిన విందు కార్యక్రమంలోనే.. భారత జాతిపిత మహాత్మాగాంధీకి చెందిన వస్తువులను ప్రవాస భారతీయులు సర్ గులామ్ కె. నూన్, నాథుపూరి తనకు అందించారని ప్రతిభ వివరించారు. ఎంతో విలువైన ఆ వస్తువులను ఇప్పుడు భారత్‌కు తీసుకొస్తున్నామని అన్నారు.

ఐటీ నిపుణులతో సహా భారతీయులు అడ్డంకులు లేకుండా బ్రిటన్ వెళ్లేందుకు సంబంధించిన అంశాలు, రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు.. తదితర అంశాలకు సంబంధించి ఆ దేశ ప్రధానమంత్రి గార్డెన్ బ్రౌన్‌తో విస్తృతంగా చర్చించినట్లు రాష్ట్రపతి తెలియజేశారు. అలాగే సైప్రస్ భారత్‌కు సన్నిహిత మిత్రదేశమని వివరించారు.

వెబ్దునియా పై చదవండి