రాణి చేతులమీదుగా బ్యాటన్‌ను అందుకున్న ప్రతిభ

FILE
లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కామన్వెల్త్ బ్యాటన్ రిలే వేడుకలు ఆట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బ్రిటన్ రాణి ఎలిజబెత్ ముఖ్య అతిథిగా నిర్వహించే ఈ వేడుకలో కామన్వెల్త్ క్రీడల సమాఖ్య అధ్యక్షుడు మైకేల్ ఫెనెల్ బ్యాటన్ (క్రీడాజ్యోతి)ని ఎలిజబెత్‌కు అందజేశారు. ఆ తర్వాత ఎలిజబెత్ చేతులమీదుగా భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ అందుకున్నారు.

అనంతరంగా ప్రతిభా పాటిల్.. ఒలింపిక్ స్వర్ణ విజేత అభినవ్ బింద్రా చేతికి బ్యాటన్‌ను అందజేశారు. భారతీయ సంప్రదాయ సంగీతం వీనులవిందుగా మోగుతుండగా బింద్రా బ్యాటన్‌ను తీసుకెళ్లి బకింగ్‌హామ్ ప్యాలెస్ గేటు అవతల ఉన్న 2012 ఒలింపిక్ నిర్వాహక కమిటీ ఛైర్మన్ సెబాస్టియన్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా క్రీడలశాఖా మంత్రి ఎం.ఎస్.గిల్, ఐఓఏ అధ్యక్షుడు సురేశ్ కల్మాడీ బ్యాటన్ రిలేను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడల నిర్వహణ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదనీ.. టోర్నీని విజయవంతం చేసేందుకు భారత ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని కరతాళ ధ్వనుల నడుమ ప్రకటించారు. కాగా.. ఈ కామన్వెల్త్ బ్యాటన్ రిలే కార్యక్రమాన్ని భారత్‌లోని పలు టీవీ ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారాలను ఏర్పాటు చేయటం విశేషం.

వెబ్దునియా పై చదవండి