"ఒబామా బృందం"లో సోనాల్ పేరు ప్రకటన

శుక్రవారం, 21 నవంబరు 2008 (12:37 IST)
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బరాక్ ఒబామా చేపట్టే విధానాలను రూపొందించే కీలక బృందంలో ప్రవాస భారతీయులురాలైన సోనాల్ షాకు స్థానం లభించింది. ఈ మేరకు పై విధానాల రూపకల్పనకు ఏర్పాటైన కార్యాచరణ గ్రూపులకు నేతృత్వం వహించేవారి పేర్లను ఒబామా సలహాదారుల బృందం ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఎన్నికల ప్రచారంలో ఒబామా ప్రకటించిన విధానాలను, ప్రణాళికలను ఈ గ్రూపులు పరిశీలించి, వాటిని కార్యాచరణకు అనుగుణంగా రూపొందిస్తాయి. ఆర్థిక వ్యవస్థ, విద్య, ఇంధనం, ప్రభుత్వ సంస్కరణలు, పర్యావరణం, ఆరోగ్యం, వలసలు, జాతీయ భద్రత తదితర రంగాలపై ఇవి ముఖ్యంగా దృష్టి సారిస్తాయని ఒబామా బృందం పై ప్రకటనలో పేర్కొంది.

ఇదలా ఉంటే... సోనాల్ షా గూగుల్ డాట్ ఆర్గ్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఈమె గూగుల్‌లో చేరకముందు గోల్డ్‌మెన్, సాచ్స్‌లలో ఉపాధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. సోనాల్ అమెరికాకు చెందిన స్వచ్చంధ సంస్థ ఇండికార్న్ సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. కాగా, ఇంకా ఈ సలహా బృందానికి ఎంపికైన వారిలో సోనాల్‌తో పాటు టెలికాం రంగానికి చెందిన ఇద్దరు నిపుణులు కూడా ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి