బుకర్ పురస్కార రేసులో మహాశ్వేతాదేవి

అంతర్జాతీయ మ్యాన్ బుకర్ పురస్కారాల తుది జాబితాలో ప్రఖ్యాత బెంగాలీ రచయిత్రి మహాశ్వేతాదేవి, భారత సంతతికి చెందిన వి.ఎస్. నాయ్‌పాల్‌లు చోటు దక్కించుకున్నారు. కాగా, బుకర్ పురస్కారం కోసం... 14 మంది రచయితలతో కూడిన తుది జాబితాను బుకర్ కమిటీ రూపొందించింది.

ఈ సందర్భంగా బుకర్ ఫ్రైజ్ నిర్వాహక కమిటీ సభ్యులు మాట్లాడుతూ... ప్రపంచ సాహిత్యరంగంలో సృజనాత్మక రచనల (ఫిక్షన్) పెరుగుదల కోసం సేవలందించిన రచయితలకు వార్షిక మ్యాన్ బుకర్ ఫ్రైజ్‌ను అందజేస్తారని పేర్కొన్నారు. అయితే ది మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ఫ్రైజ్‌కు దీనికీ సంబంధం లేదని వారు స్పష్టం చేశారు.

కాగా... ఈ రెండు అవార్డులు కూడా పిక్షన్ రంగంలో సేవలు అందించినవారికి అందజేస్తున్నట్లు ఫ్రైజ్ నిర్వాహక వర్గం వెల్లడించింది. ఇదిలా ఉంటే... మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ఫ్రైజ్ 2009, మూడవ ఎడిషన్‌కు ప్రఖ్యాత భారతీయ రచయిత అమిత్ చౌదరీ, జేన్ స్మైలీ, ఆండ్రూ కుర్కోవ్‌లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నట్లు వారు చెప్పారు.

మ్యాన్ బుకర్ ఫ్రైజ్ అవార్డుకు 12 దేశాల నుంచి 14 మందిని తుది జాబితాలో చేర్చగా... మనదేశానికి చెందిన మహాశ్వేతాదేవి, భారత సంతతికి చెందిన నాయ్‌పాల్‌లు చోటు దక్కించుకున్నారు. ఈ అవార్డుకు ఎంపికైన వారికి 60 వేల పౌండ్ల నగదును బహుమానంగా అందజేయనున్నారు.

వెబ్దునియా పై చదవండి