న్యూయార్క్‌లో ప్రవాస భారతీయ విద్యార్థిని దుర్మరణం..!

FILE
న్యూయార్క్‌లోని దక్షిణ విర్జీనియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రవాస భారతీయ విద్యార్థిని ఒకరు దుర్మణం పాలవగా, మరో ఏడుగురు గాయాలపాలయ్యారనీ అక్కడి పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి గురైన వ్యాన్‌ను నడుపుతున్న వ్యక్తి నిద్రలోకి జారుకోవటంతో ఈ ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోందని వారు చెప్పారు.

సార్జంట్ థామస్ జె మాల్నర్ మాట్లాడుతూ.. పెన్సిల్వేనియాలో నివసిస్తున్న 21 సంవత్సరాల కమ్మిని రఘూపాత్ అనే అమ్మాయి సీట్ బెల్ట్ ధరించకుండా ప్రయాణించినట్లుగా తెలుస్తోందన్నారు. ఆ సమయంలో జరిగిన ప్రమాదంలో కిటికీలోంచి బయటకు విసిరివేయబడి మృతి చెందిందని ఆయన ఫిలడెల్ఫియా ఇన్‌క్వెయిర్‌కు వివరించారు.

టెంపుల్ యూనివర్సిటీకి చెందిన భాంగ్రా డ్యాన్స్ జట్టు సభ్యురాలైన రూపాత్, ఇతర సభ్యులతో కలిసి నార్త్ కరోలినాలో జరిగే ఓ కాంపిటీషన్‌లో పాల్గొనేందుకు బయలుదేరింది. ఈ సమయంలో డ్యాన్స్ టీం సభ్యులలో ఒకరైన బిలాల్ బబ్రుద్దీన్ (20) వ్యాన్‌ను డ్రైవ్ చేస్తున్నాడు. అయితే అతను డ్రైవ్ చేస్తూనే నిద్రలోకి జారుకోవటంతో ఈ ప్రమాదం సంభవించగా, రూపాత్ చనిపోగా, మిగిలినవారంతా గాయాలపాలైనట్లు మోల్నర్ పేర్కొన్నారు.

ఈ ప్రమాదంలో గాయపడిన మనీషా మోడీ మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో తన కాలర్ బోన్ విరిగిపోయిందని వాపోయింది. అయితే తమ డ్రైవర్ తప్పువల్లనే ప్రమాదం జరిగిందనీ, ఈ విషయంలో ఎవరినీ నిందించాల్సిన పనిలేదంది. మరో విద్యార్థి ఫాతిమా తీవ్రగాయాలపాలై రిచ్‌మాండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. డ్రైవర్ బబ్రుద్దీన్, మనీషా మోడిలు మాత్రం చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు.

వెబ్దునియా పై చదవండి