బీజింగ్ ఒలింపిక్ క్రీడల్లో అమెరికా మహిళా వాలీబాల్ జట్టుకు కోచ్‌గా చైనాకు చెందిన లాంగ్ పింగ్ వ్యవహరిస్తున్నారు. కోచ్ పింగ్ ఘనత గురించి చైనా పత్రికలు పొగిడాయి. వాలీబాల్ క్రీడలో చైనా-అమెరికా జట్ల మధ్య తేడా కోచ్ పింగ్ ఒక్కడే అని వార్తా పత్రికలు అంటున్నాయి. పింగ్ కారణంగా ఇరుజట్లకు ఒలింపిక్స్‌లో అభిమానుల నుంచి ఆదరణ ఎక్కువైంది.
చైనా వాలీబాల్ చరిత్రలో పింగ్ కంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. పింగ్ కారణంగా అమెరికా వాలీబాల్ జట్టుకు చైనాలో అభిమానుల సంఖ్య ఎక్కువైందని యూఎస్ క్రీడాకారిణి నికోల్ డేవ్స్ చెప్పారు. చైనా వాలీబాల్ క్రీడాకారుడుగా పింగ్ 1984 ఒలింపిక్స్‌లో బరిలోకి దిగినపుడు స్వదేశానికి స్వర్ణ పతకాన్ని అందించటంలో పింగ్ కీలకపాత్ర పోషించాడు.
అమెరికా వాలీబాల్ జట్టుకు కోచ్‌గా పింగ్ 2005 నుంచి వ్యవహరిస్తున్నాడు. చైనాలో పోటీలు జరుగుతునప్పటికీ మాతృదేశంపై అభిమానం లోలోపల దాగి ఉంచుకుని తాను ప్రాతినిథ్యం వహిస్తున్న అమెరికా జట్టు విజయం కోసం పోరాడతానని పింగ్ వెల్లడించారు.