ఒలింపిక్స్‌పై భారత జట్టులో భారీ ఆశలు

మంగళవారం, 5 ఆగస్టు 2008 (16:52 IST)
చైనా తొలిసారి ఆతిథ్యమిస్తున్న బీజింగ్ ఒలింపిక్ క్రీడల్లో మెరుగ్గా రాణించి పతకాలు సాధించాలని భారత జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. భారత జట్టు తలపడే అన్ని క్రీడల్లో సీనియర్లు, జూనియర్లు తమ స్థాయి మేరకు రాణించాలని ఆశావహ ధృక్పథంతో ఉన్నారు. అలాగే ఒకరి ఆలోచనలను మరొకరు పంచుకోవటానికి ముందుకు వచ్చారు.

షూటింగ్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్ మానవ్‌జీత్ సింగ్ సంధూ పతకం గెలుచుకుంటాడని అభిమానులు అంచనావేశారు. విశ్వ క్రీడల్లో ఆశించిన స్థాయిలో రాణించి పతకం గెలుచుకుంటానని సంధూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. షూటింగ్ విభాగంలో భారత జట్టు అతిరథ మహారథులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారని సంధూ చెప్పారు.

టెన్నిస్ క్రీడలో డబుల్స్ విభాగ ప్రపంచ నెంబర్ వన్ జోడీ లియాండర్ పేస్-మహేష్ భూపతిలు పతకంతో తిరిగి వస్తారని క్రీడా నిపుణులు అంచనా వేశారు. ఒలింపిక్ క్రీడల్లో కలిసి బరిలోకి దిగటం పేస్-భూపతిలకు ఇదే మొదటిసారి. మా జోడీ కష్టపడితే పతకం సాధించటం కష్టం కాదని పేస్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.

భారత బాక్సింగ్ జట్టుపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. భారత జట్టులో విజీందర్ సింగ్, అఖిల్ కుమార్‌లు ఉన్నారు. ఒలింపిక్ ఛాంపియన్‌గా మరోసారి నిలవాలనే పట్టుదల విజీందర్ సింగ్‌లో కన్పిస్తుంది.

వెబ్దునియా పై చదవండి