బీజింగ్‌కు బయలుదేరిన భారత బాక్సింగ్ జట్టు

శనివారం, 2 ఆగస్టు 2008 (17:26 IST)
భారత బాక్సింగ్ జట్టు విశ్వ క్రీడల్లో పాలుపంచుకునేందుకు బీజింగ్‌కు పయనమైంది. బాక్సింగ్ క్రీడలో ఒక పతకాన్ని గెలుచుకుంటానని ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఆఖిల్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశాడు. చైనా తొలిసారి ఆతిథ్యమిస్తున్న బీజింగ్ ఒలింపిక్ క్రీడలు ఆగస్టు 8-24 తేదీల మధ్య ఆడంబరంగా జరుగుతాయి.

భారత బాక్సింగ్ జట్టులో మొత్తం ఐదుగురు క్రీడాకారులు ఉన్నారు. వీరికి సహాయకులుగా ఇద్దరు కోచ్‌లు, ఒక ఫిజియో, మేనేజర్ ఒకరు ఉన్నారు. ఏథెన్స్ ఆతిథ్యమిచ్చిన 2004 ఒలింపిక్స్‌లో భారత బాక్సింగ్ జట్టు తరపున అఖిల్ ఆడాడు.

న్యూఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (ఐజీఐ) లో బీజింగ్‌కు పయనమైన బాక్సింగ్ జట్టుకు భారత బాక్సింగ్ సమాఖ్య ఆధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలా వీడ్కోలు పలికారు. క్రీడాకారులందరూ విశ్వ క్రీడల్లో మెరుగైన ఆటతీరు కనబరచాలని కోరారు. భారత అభిమానుల ఆశలను ఫలవంతం చేయటంలో క్రీడాకారులు సఫలం కాగలరని చౌతాలా ఆశాభావం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి