అన్నదమ్ములకు ఒకే యేడాది.. ఒకేసారి వివాహం చేయవచ్చా?

FILE
సాధారణంగా ఒక సంతానికి చెందిన అన్నదమ్ములకు ఒకేసారి వివాహాలు చేయరు. విధిలేని పరిస్థితుల్లో మాత్రం ఈ తరహా వివాహాలు చేస్తుంటారు. అయితే ఇలాంటి వివాహాలు చేయాల్సి వస్తే ఎంత కాలం వ్యవధి ఉండాలన్న అంశంపై సందేహం నెలకొంటుంది.

దీనిపై జ్యోతిష్య నిపుణులను సంప్రదిస్తే.. ఒకతల్లి బిడ్డలైన ఇద్దరు అన్నదమ్ములకి ఒకే సంవత్సరంలో వివాహం గానీ, ఉపనయనం గానీ చేయరాదంటున్నారు. ఇక్కడ సంవత్సరం అంటే పన్నెండు నెలలు కాదు. సంవత్సరం మారితేనే శుభప్రదమంటున్నారు.

అయితే మొదటి కుమారుడికి వివాహం చేసిన స్వల్ప వ్యవధిలోనే కుమార్తె వివాహం చేయవచ్చని చెపుతున్నారు. వివాహానంతరం ఉపనయనమైతే ఆరు మాసాలు తేడా ఉండాలని చెపుతున్నారు. కుమారుని ఉపనయనం అయిన తర్వాత వివాహానికి తక్కువ కాలవ్యవధి ఉన్నా ఫర్వాలేదని చెపుతున్నారు.

ఇద్దరు కుమారుల ఉపనయనానికైనా, వివాహానికైనా, ఇద్దరు కుమార్తెల వివాహానికైనా కనీసం ఆరు నెలల వ్యవధి ఉంటే మంచిదని చెపుతున్నారు. ఈ నియమం కవల సంతానానికి వర్తించదు. కుమార్తె వివాహానంతరం కుమారుని వివాహం చేయవచ్చంటున్నారు. కుమారుని వివాహం అయిన తర్వాత కుమార్తె వివాహానికి ఆరు మాసాల వ్యవధి ఉండాలంటున్నారు.

వెబ్దునియా పై చదవండి